LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ALSO ON TELUGUONE N E W S
  ఇప్పుడు యష్(Yash)అభిమానులందరు 'ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అనే సాంగ్ పాడుకుంటూ మస్త్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే  'టాక్సిక్'(Toxic)విడుదలపై వాళ్ళల్లో ఉన్న సస్పెన్స్, ఉత్కంఠత కి తెరపడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ పాన్-ఇండియా చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు  యష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా 'నీ తండ్రిని గౌరవించు.. టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని  ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందంతో ఉన్నారు. ఈ సరికొత్త పోస్టర్‌లో యష్ రాయ, టికెట్ అనే విభిన్నమైన లుక్స్‌లో తండ్రీకొడుకులుగా రెండు పవర్‌ఫుల్ రోల్స్ లో కనిపించి కనువిందు చేశారు. మొదట మార్చి 19న విడుదల చేసి రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' చిత్రంతో పోటీ పడేలా ప్లాన్ చేశారు. అయితే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య తలెత్తిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం కారణంగా ఓవర్సీస్ పంపిణీ దెబ్బతినే అవకాశం ఉండటంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా కంటెంట్‌ను సినిమాకాన్ ఈవెంట్‌లో అంతర్జాతీయ బయ్యర్లకి  ప్రదర్శించినప్పుడు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, దీనిని మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయంగా విడుదల చేయాలని  భావించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో మేకప్స్ జూన్ విడుదలని  వాయిదా వేయాల్సి వచ్చింది. Also read: Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్ తో పోతే ఎవరిదీ బాధ్యత ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు 2026 ఆగస్టు 26 న  ఫైనల్ రిలీజ్ డేట్‌గా లాక్ చేశారు. ఈ సరికొత్త బుధవారం విడుదల తేదీ సినిమాకి  భారీ ప్లస్ కానుంది. ఎందుకంటే ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం, ఓనం, ఈద్ మరియు రక్షాబంధన్ వంటి వరుస పండుగల సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ చేస్తున్న చిత్రం కావడంతో  అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఈ భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యష్ కూడా కథా రచనలో భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మించాడు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీ రోల్స్.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఏ హీరో కూడా చేయని విధంగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సదరు చిత్రాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకరి సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్' ఒకటి. ఈ మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన 'యానిమల్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీ  అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామా షూటింగ్ తెలంగాణలో అత్యంత వేగంగా, నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మేకర్స్  దాదాపు రెండు నెలల పాటు సాగే ఒక పవర్‌ఫుల్ లాంగ్ షెడ్యూల్‌ని  ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుని  వేదికగా ఎంచుకుంది. ఈ రోజు జైలు పరిసరాల్లో ప్రభాస్‌పై కొన్ని కీలకమైన, అత్యంత ఇంటెన్స్ సీన్లని  చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్  పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా గ్ ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజీతో పాటు బాలానగర్‌లోని ప్రముఖ 40 ఏళ్ల నాటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ 'విమల్ థియేటర్'లో కీలక షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ వస్తున్నారనే విషయం లీక్ అవ్వడంతో వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. క్రౌడ్ కంట్రోల్ కోసం భారీ ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇప్పుడు చంచల్‌గూడ జైలు వద్ద కూడా ప్రభాస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు. షూటింగ్ లొకేషన్ నుండి ఒక క్రేజీ షాడో పిక్ కూడా లీకై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. Also read: Rhea kapoor: అనిల్ కపూర్ కుమార్తె డైమండ్ ఇయర్ రింగ్స్ చోరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ రోల్ లో చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ని అందిస్తుండగా  టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2027 మార్చి 5వ రిలీజ్ డేట్ .    
రియా కపూర్.. బాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె.. ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫ్యాషన్ స్టైలిస్ట్  అయిన  రియా కపూర్ టీమ్‌లో జరిగిన ఒక భారీ చోరీ ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ కోసం రియా కపూర్ ముంబైలోని ప్రముఖ జ్యువెలర్స్ నుండి  1.35 కోట్ల విలువైన వజ్రాల మరియు పచ్చల (ఎమరాల్డ్) బంగారు చెవి జుమ్మీలు అద్దెకి తీసుకుంది. విమాన ప్రయాణంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్ నుండి   నగలు మాయమవ్వడం బాలీవుడ్ వర్గాల్లో పెను షాక్‌కి  గురిచేసింది.  ఈవెంట్‌లో పాల్గొనేందుకు రియా కపూర్ తన వ్యక్తిగత స్టాఫ్, స్టైలింగ్ టీమ్‌తో కలిసి పయనమయ్యారు. ఈ ఈవెంట్ కోసం ముంబైలోని ప్రముఖ మెహతా జ్యువెలర్స్ నుండి రూ. 66 లక్షల విలువైన ఎమరాల్డ్ స్టోన్ డైమండ్ గోల్డ్ ఈరింగ్స్, అలాగే ప్రఖ్యాత గోయెంకా జ్యువెలర్స్ నుండి రూ. 69 లక్షల విలువైన జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్డ్ ఈరింగ్స్‌ను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు అత్యంత ఖరీదైన జుమ్మీల బాక్సులను రియా కపూర్ వద్ద గత 7 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన పర్సనల్ హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపరుచుకున్నారు. హోటల్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మెట్ గాలా ట్రయల్స్ కోసం మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి, మరో టీమ్ మెంబర్ షిరీన్‌కు ఇచ్చేందుకు జ్యువెలరీ బాక్సులను బయటకు తీశారు. అయితే ఆ బాక్సులను తెరిచి చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్. ఆ రెండు జ్యువెలరీ బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి! రూ. 1.35 కోట్ల విలువైన ఆ రెండు జంటల వజ్రాల జుమ్మీలు అందులో లేవు. Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరం స్పీచ్ వైరల్ న్యూయార్క్‌లో ఉండగానే ఈ దొంగతనం గుర్తించినప్పటికీ, టీమ్ అంతా ముంబై తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై అధికారికంగా పోలీసులకి  ఫిర్యాదు చేశారు. మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఫిర్యాదు మేరకు ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంతకీ ఈ భారీ చోరీ ఎక్కడ జరిగింది అనే కోణంలో పోలీసులు తలమునకలవుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందా? లేక దుబాయ్ లేఓవర్‌లో ఫ్లైట్ మారే సమయంలో జరిగిందా? లేక న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ మరియు హోటల్ మార్గంలో జరిగిందా? అనే మూడు ప్రధాన అనుమానాస్పద సమయాలపై (టైమ్‌లైన్స్) పోలీసులు ఫోకస్ పెట్టారు. సిసిటివి ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ, టీమ్‌తో పాటు ప్రయాణించిన ఇతరుల వివరాలను కూడా వెరిఫై చేస్తున్నారు. సెలబ్రిటీల హై ప్రొఫైల్ ప్రయాణంలో ఇంతటి భారీ మొత్తంలో విలువైన వజ్రాల నగలు మాయమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనిల్ కపూర్ పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
  కిరణ్ అబ్బవరం అప్ కమింగ్ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రచార చిత్రాలు బాగుండటంతో మూవీపై అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా నిన్న  తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన 'జిగితార' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం పాల్గొని సందడి చేశాడు.  ఈ వేడుకకి  భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ నా కెరీర్‌లో 'చెన్నై లవ్ స్టోరీ' ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా తిరుపతి ప్రజలు చూపిస్తున్న ఆదరణకు, ప్రేమాభిమానాలకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మూవీలోని ప్రతి క్యారక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 'జిగితార' సాంగ్ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యువతతో పాటు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక మంచి అనుభూతితో థియేటర్ల నుండి బయటకు వస్తారని పేర్కొన్నాడు. Also read: ఈ హీరోయిన్ ని ఆ బడా నిర్మాత టార్గెట్ చేశాడా! ఎందుకు టార్గెట్ చేసాడో తెలిస్తే షాక్ అవుతారు ఈ సినిమా కథాంశం ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటి నుండి చెప్తోంది. కిరణ్ అబ్బవరం మార్కు వినోదంతో పాటు, ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ మరియు చక్కని మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోవాలని చూస్తున్న కిరణ్, ఈ కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యానని, దర్శకుడు అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించాడు. సినిమా బిజినెస్ పరంగా కూడా భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది .మ్యాడ్’ ఫేమ్ గౌరీ ప్రియ హీరోయిన్‌ కాగా మణిశర్మ మ్యూజిక్.  రవి దర్శకుడు. జులై 24 న రిలీజ్ కాబోతుంది.        
The teaser of Jolliya Iruntha Oruthan (JIO) has finally arrived and the film is clearly banking on nostalgia. Jiiva and director Rajesh M are coming together again after delivering the blockbuster Siva Manasula Shakti (SMS), a film that still enjoys cult status among comedy lovers.  But while the makers are positioning JIO as a reunion of that successful combination, there is one obvious change audiences instantly noticed. Santhanam is not part of this outing. Santhanam and Jiiva combination has earned cult classic combo reputation.  Now, Parithabangal Sudhakar has replaced Santy. From the teaser, Sudhakar and Jiiva seem to share good chemistry and there is an easy-going energy between them. At the same time, comparing them with the Santhanam–Jiiva combination would be cruel because that pairing already carries years of audience affection and recall value. But with the way JIO is being marketed, the comparison is inevitable. Still, the teaser looks promising and more importantly, it brings Jiiva back into a full-fledged comical role. Rajesh M needs this film to work big time and let's see how it all goes. One thing noticable though while they took a comical dig at CM Vijay they dedicated the teaser to him as it released on his birthday. Yuvan Shankar Raja is back as the composer with Ivana as leading lady.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.