Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిప్యూటీ కలెక్టర్ నరహరి లాకర్లలో భారీగా బంగారం, నగదు.. ఏసీబీ చరిత్రలోనే రికార్డు స్థాయి సీజ్
posted on: Jun 21, 2026 7:17AM

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


.webp)
.webp)


