TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన సినిమాల పేర్లు

Published on: Mon Nov 28, 2011 11:35AM

సహజంగా ఒక సినిమా హిట్టయితే చాలా మంది నిర్మాతలు సెంటిమెంట్ గా అలాంటి పేరే తమ సినిమాకు కూడా ఉండాలని కోరుకుంటారు...అలాంటి పేర్లే తమ చిత్రాలకు పెడుతూంటారు కూడా...! ఉదాహరణకు కాపురం పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. "కొల్లేటి కాపురం, వింత కాపురం, చెల్లెలి కాపురం, పండంటి కాపురం, పచ్చని కాపురం, కలహాల కాపురం, దొంగ కాపురం, బంగారు కాపురం, కోడలు దిద్దిన కాపురం, పండంటి కాపురానికి 12 సూత్రాలు" వంటి చిత్రాలు వచ్చాయి.

ఇక సంసారం పేరుతో "సంసారం, సంసారం-సాగరం, పండంటి సంసారం, నిండు సంసారం,సంసారం ఒక చదరంగం, సంసారం ఓ సంగీతం" వంటి చిత్రాలు వచ్చాయి. మొగుడు పేరుతో "దొంగమొగుడు, మంచి మొగుడు, కొంటె మొగుడు, అల్లరి మొగుడు, చాదస్తపు మొగుడు, కొంటె మొగుడు-పెంకి పెళ్ళాం" వంటి అనేక చిత్రాలు వచ్చాయి.

దొంగ పేరుతో "దొంగ, మంచి దొంగ, జేబుదొంగ, దొంగలకు దొంగ, దొంగల్లో దొర, అందరూ దొంగలే, దొరికితే దొంగలు, దొంగ దొంగ, దొంగోడొచ్చాడు' అలా అనేక సినిమాలొచ్చాయి. ఇల్లాలు పేరుతో "ఇల్లాలు, ఇల్లు- ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, రావుగారిల్లు, ఇల్లాలే దేవత, ఈ తీర్పు ఇల్లాలిది, ఇల్లాలు- ప్రియురాలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు"ఇవన్నీ సాంఘీక చిత్రాలైతే పౌరాణిక చిత్రాలు శ్రీకృష్ణ పేరు మీద, శ్రీరామ పేరు మీద అనేకం వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతుండదు.