వై.ఎస్.ఆర్.పి.సి. కి కార్యకర్తలు ఫుల్... నాయకులు నిల్
posted on Mar 13, 2012 5:26PM
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు పల్లెబాటపట్టారు. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేయడం ఖాయం. దీంతో వారిరువురు గ్రామాల్లో తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. వీరిద్దరూ ఇంటింటికి తిరుగుతూ తమకు ఓట్లు చేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు. రచ్చబండల వద్ద సేదతీరుతూ ప్రజా సమస్యలను వింటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ తమ ప్రభవాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులు కేంద్రీకరిస్తోంది. ఉపఎన్నికలు జరుగుతున్న ఈ రెండు నియోజకవర్గాల్లో వై.ఎస్, ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం పెద్దగా లేకపోయినప్పటికి కార్యకర్తల అండ పుష్కలంగా ఉంది. అభ్యర్థులు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వారికి కలుస్తున్నారు. నాయకులు లేకపోయినా కార్యకర్తల అండ ఉంటే చాలు గెలవడానికి అన్న ధీమాతో ఇరువురు నాయకులు ఉన్నారు...