ఇడుకులపాయకు ఓకే, గుంటూరుకు నో

 

అక్రమాస్తుల కేసులో 16 నెలల రిమాండ్‌ తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. దీంతో హైదరాబాద్‌ విడిచి ఎటూ వెళ్లడానికి అవకాశం లేని జగన్‌ తనను ఇడుకులపాయతో పాటు గుంటూరుకు వెళ్లటానికి అవకాశం కల్పించాలని కోర్టును కోరారు.

అయితే తన తండ్రి సమాధిని చూడటానాకి ఇడుకులపాయకు వెళ్తానన్న జగన్‌ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన కోర్టు, పార్టీ కార్యక్రమంగా గుంటూరులో చేస్తున్న రైతు గర్జనకు వెళ్లటానికి జగన్‌కు అనుమతి నిరాకరించింది. దీంతో 1,2 తారీఖుల్లో జగన్‌ ఇడుకులపాయ వెళ్లనున్నారు. అయితే మరి గుంటూరు వెళ్లే విషయమై జగన్‌ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu