పవన్ కోసమే 'ఎవడు' ఆడియో వాయిదా
posted on Jun 29, 2013 1:00PM

రామ్ చరణ్ కి 'నాయక్' తరువాత టైం అసలు కలిసి రావడం లేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్ 'జంజీర్' కోర్ట్ కేసులతో వాయిదా పడుతూ వస్తుంటే...ఇప్పుడు 'ఎవడు' సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజురోజుకూ వెనక్కిపోతునే వుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో మళ్ళీ వాయిదా పడింది. 'ఎవడు' మూవీ ఆడియో ఈ నెల 30న విడుదల చేస్తున్నామని హీరో రామ్ చరణ్ కూడా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు గాని దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
'ఎవడు' ఆడియో రిలీజ్ కి గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కోసం యూరప్ వెళ్ళారు. అక్కడి నుంచి 30న హైదరాబద్ కి రానున్నారు. ఈ నేపధ్యంలో ఒకటికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి జూలై ఈ '1' సినిమా ఆడియో విడుదలవుతుందో లేదో!