గవర్నర్‌కి ఫిర్యాదు

 

ఆంధ్రప్రదేశ్ శానసభలో అసభ్యంగా మాట్లాడుతూ, అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ అనంతరం సదరు సభ్యులు స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకి వచ్చేశారు. అ తర్వాత వైసీపీ నాయకుడు జగన్‌తోపాటు ఇతర సభ్యులు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకి వచ్చారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఆ తర్వాత వైసీపీ సభ్యులందరూ గవర్నర్ నరసింహన్ని కలిసి ఏసీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu