రోహిత్ శర్మ సెంచరీ

 

ప్రపంచ కప్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా మెల్‌బోర్న్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 108 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్స్‌తో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈమధ్య కాలంలో సరిగా రాణించని రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయి ఆడి సెంచరీ చేశారు. సెంచరీకి ముందు రోహిత్ శర్మ ఔటయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. భారత్ స్కోరు 197 పరుగుల వద్ద ఇన్నింగ్స్ 40వ ఓవర్లలో బంగ్లా బౌలర్ రూబెల్ హొస్సేన్ వేసిన నాలుగో బంతిని రోహిత్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయాడు. అయితే బంతి గాల్లోకి లేచి బంగ్లా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో బంగ్లా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. రోహిత్ సెంచరీ చేయడం భారత క్రికెట్ అభిమానుల్లో ఆనందం నింపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu