ఇండియా స్కోరు 302
posted on Mar 19, 2015 2:09PM

వరల్డ్ కప్ క్రికెట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆస్ల్రేజరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్‌లో రోహిత్ శర్మ 137 పరుగులు చేసి ఇండియా గౌరవప్రదమైన స్కోరు చేయడానికి సహకరించాడు. ఇంకా శిఖర్ ధావన్ 30 పరుగులు, విరాట్ కోహ్లీ 3, రహానే 19, రైనల 65, ధోనీ 6, జడేజా 23, అశ్విన్ 3 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ 3 వికెట్లు, మొర్తాజా, రుబెల్, షకీబ్ తలా ఒక వికెట్ తీశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు ఫీల్డర్లు కూడా మైదానంలో చెలరేగిపోవడంతో భారత బ్యాట్స్‌మన్లు ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఒక దశలో భారత్ 300 పరుగులైనా సాధిస్తుందా అన్న అనుమానం వచ్చినప్పటికీ రోహిత్ శర్మ పుణ్యమా అని పుంజుకుంది. అయితే చివర్లో మళ్ళీ మందకొడి బ్యాటింగ్ స్కోరును తగ్గించింది. మొత్తంమీద 302 పరుగులు చేయడం పర్లేదనిపించింది.