బీజేపీ బాణం ఎవ‌రికి గాయం?

రాజ‌కీయాల మ‌లుపు ఊహించ‌నివి, చిత్ర విచిత్ర‌మైన‌వీను. ఎవ‌రు ఎవ‌ర్ని చెట్టెక్కిస్తారు, ఎవ‌రు ఎవ‌ర్ని ద‌గ్గ‌ర‌కుచేర్చుకుంటారు, ఎవ‌రు ఎవ‌ర్ని దూరం చేసుకుంటార‌న్నది ఇద‌మిద్ధంగా ఫ‌లానా కార‌ణ‌మ‌ని చెప్పడం బ‌హు క‌ష్ట్ హై. ఇక్క‌డ సాగినా సాగ‌క‌పోయినా కేంద్రంలో తేల్చుకుంటాన‌ని ఒంటికాలిమీదా లేస్తుంటారు. ఎన్నాళ్లీ ప్రాంతీయ‌ త‌త్వం.. ఇక సాగిద్దాం కేంద్రంతో తాడో పేడో అన్న ఉత్సాహంతో ఉర‌క‌లూ వేస్తుంటారు. ఇపుడు ఉర‌క‌లు వేస్తూ ఢిల్లీలో కొత్త పార్టీతో హ‌ల్ చెల్ చేయించాల‌న్న ధోర‌ణితో   తెగ హడావుడి పడుతున్న టిఆర్ఎస్ అధినేత తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. కేసీఆర్ ఢిల్లీ క‌లలు పండించుకోవ‌డానికి ఓ పార్టీ అవ‌స‌రం గ‌నుక బీఆర్ ఎస్ అంటూ టీఆర్ఎస్ కే జాతీయరంగు పులి మారు. ఇపుడు ఆయ‌న మ‌రింత ఠీవీగా న‌డ‌వ‌డానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుక్కార‌ణం బీజేపీ వారితో లోపాయ కారి ఒప్పందాలు జ‌రిగాయ‌న్న ఆరోపణలను ఎదుర్కొంటుండడమే.

అస‌లు టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి రావ‌డ‌మే బీజేపీ స‌హాయ‌స‌హ‌కారాల‌తోన‌ని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్‌గా మారింద‌న్న అభిప్రాయాలు ఢిల్లీ నుంచి పటాన్ చెరు వ‌ర‌కూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కేంద్రం మీద, బీజేపీ మీద టీఆర్ ఎస్ అధినేత‌, నేత‌లు ఎంత విరుచుకుప‌డుతున్నా బీజేపీ మాత్రం న‌వ్వుకుంటోంది, అరకొరగా ప్రతి విమర్శలు చేస్తోందే కానీ గ‌ట్టిగా, దీటుగా తెరాస నేతల నోళ్లు మూయించేలా వ్యవహరించడం లేదు. ఇందుకు కార‌ణం వారికి కావ‌ల్సింది తెలంగాణాలో పాగా వేయ డం, అందుకు టీఆర్ ఎస్ కంటే కాంగ్రెస్ ను  అడ్డు తొల‌గించుకోవ‌డం ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్ బ‌లం పుంజుకోవ‌డంతో పాటు కాస్తంత దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో తెరాస కంటే కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకూ బీజేపీ ప్రథమ తాంబూలమిస్తోంది. తెలంగాణాలో పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో కొంద‌రు నాయ‌కుల‌ను వాగ్ధాటి ఉన్న‌వారిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మీద దాడి చేయ‌డం జ‌రుగుతోంది. కానీ టీఆర్ ఎస్ ప‌ట్ల మాత్రం అంత ఘాటు ప్రేలాప‌న‌లేవీ లేవు. పైకి తిడుతున్న‌ట్టు క‌న‌ప‌డుతున్నా, లోలోప‌ల సారీ మావా.. అన్న సామెత‌గా సాగుతోంది టీఆర్ ఎస్‌, బీజేపీ దోస్తానా.  ఎంఐఎంని గ‌ట్టిగా టీఆర్ ఎస్ తిట్ట‌లేన‌ట్టే, బీజేపీ మ‌రింతగా ఈడీ దాడులు టీఆర్ ఎస్ మీద ప‌రుగులెత్తించ‌డ‌మూ లేదు. వేడి త‌గ్గించి ఏదో తూతూ మంత్రంలా ఎవ‌రూ అవమానించ‌కుండా బీజెపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. దక్షిణాది లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలంటే, బీజేపీ ఇపుడు కావ‌ల‌సింది కేసీఆర్ లాంటి నాయ‌కుడే. 

టీఆర్ ఎస్‌కి, ప్ర‌త్యేకించి కేసీఆర్‌కి కావ‌ల‌సింది తెలంగాణాలో కాంగ్రెస్ అడ్డంకి తొల‌గించుకోవ‌డ‌మే. అం దుకే ఇక్క‌డ బీజేపీని తిడుతున్నా ఆన‌క బీజేపీ భ‌జ‌న మాత్రం చేస్తోంది  టీఆర్ ఎస్‌. ప్రాంతీయంగా అలాగే కమలం పార్టీకి కూడా  కాంగ్రెస్‌  గెల‌వ‌కుండా చేయ‌డానికి ఇక్క‌డ బ‌ల‌మున్న నాయ‌కులు, పార్టీ అవ‌స‌రం గుర్తించింది గ‌నుక నే బీజేపీ కేసీఆర్‌ను ఎన్నుకుంది. దీని వ‌ల్ల కేసీఆర్‌కి క‌లిగే ప్ర‌యోజ‌నం ఎలా ఉన్నా,  బీజేపీ మాత్రం ఎంతో ల‌బ్ధిపొందుతుంది. అన్నిటికీ మించి ఎదుటివాడి మీదకు పక్కవాడి భుజం మీంచి తూటా పేల్చాలనే వ్యూహాన్నే ఇరు పార్టీలూ అనుసరిస్తున్నాయి. బీజేపీ నిజంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజృంభించి అధికారంలోకి వ‌స్తే, టీఆర్ఎస్ మీద కంటే కాంగ్రెస్ మీద భారీ విజ‌యంగానే భావిస్తుంది. కేంద్రంలో అధికారమంటూ నేల విడిచి సాము చేస్తున్న కేసీఆర్ మాత్రం ఇక్క‌డ పార్టీ ప‌రి స్థితిని ఇప్ప‌టికే  ప్ర‌శ్నించే అభిమానుల‌కు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు  న‌మ్మ‌కంగా గ‌ట్టి స‌మాధా నం ఇవ్వ‌లేక‌పోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu