అభిమానం ఖ‌రీదు అక్ష‌రాలా రూ.24 వేలు!

ప్ర‌తీవారికి ఒక అభిమానన‌టుడో, క్రీడాకారుడో ఉంటారు. అభిమానం వేలంవెర్రిగాకుండానే ఉండాలి. స్థాయి మించి వెర్రిగా మారితేనే తెలీకుండా ఎంతో న‌ష్టం చేసుకుంటారు. ఆ న‌టుడు, ఆ క్రీడాకారుడూ బాగానే ఉంటారు, ఓ ఫోటోనో, ఆటోగ్రాఫో, న‌వ్వో ప‌డేసి వెళిపోతారు. ఆన‌క ఆలోచించిచూస్తే న‌ష్ట‌పోయేది మాత్రం ఈ  వీరాభిమానే. అందువ‌ల్ల ఏద‌న్నాస‌రే హ‌ద్దులు మీర‌కూడదంటారు. కానీ  రాహుల్ రాయ్ మాత్రం  హ‌ద్దులు చాలా మీరేడు!

అస్సాం కుర్రాడు రాహుల్ రాయ్‌కి కింగ్ కోహ్లీ అంటే ప‌డి చ‌చ్చేంత ఇష్టం. అస‌లు స‌చిన్‌,  కోహ్లీల‌కు ఇ లాంటి వీరాభిమానులే ఉన్నారు, ఉంటారు. ఎంత అభిమానం, ప‌చ్చి అంటే కింగ్ కోసం అస్సామీ కుర్రా డు ఏకంగా 23 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు!  అదుగో అలా ఆశ్చ‌ర్య‌ప‌డ‌వ‌ద్దు.. అదంతే.. కోహ్లీయా మ‌జాకా..!  

మొన్న గౌహ‌తీలో మ్యాచ్‌కి టీమ్ ఇండియా వ‌చ్చిన‌పుడు కోహ్లీని చూడాల‌ని బోర్జార్ ఎయిర్‌పోర్ట్‌కి రాహుల్ రాయ్ వెళ్లాడు. అక్క‌డ క‌ల‌వ‌లేక‌పోయాడు, టీమ్ వెళ్లే బ‌స్సు వెంట‌బ‌డ్డాడు.. కోహ్లీ క‌ళ్ల‌లో ప‌డాల‌ని..అన్ని య‌త్నాలూ విఫ‌ల‌మ‌య్యాయి. స్టేడియంలోకి వెళ్లేముందు కూడా ప్ర‌య‌త్నించాడు. కానీ సెక్యూరిటీ అస్స‌లు ద‌రిదాపుల్లోకి వెళ్ల‌నీయ‌లేదు. 

గౌహ‌తీలో క‌ల‌వ‌కుంటే ఆ త‌ర్వాత ముంబై, ఢిల్లీ వెళ్లి క‌ల‌వ‌డం మ‌రీ దుర్ల‌భం అనుకున్నాడు. వెంట‌నే అత‌నికి ఓ మెరుపు ఆలోచ‌న‌వ‌చ్చింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లోనే తాను ఒక గ‌ది బుక్ చేసుకుంటే ఎలా అని. ఇది విన‌డానికి చిత్రంగా ఉంటుంది గాని ప్ర‌య‌త్నించి సాధించాడు. అయితే అందుకు అత‌నికి త‌ల‌కు మించిన భార‌మే అయింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లో ల‌క్కీగా ఓ గ‌ది ఖాళీగా ఉండ‌డం రాహుల్ భ‌గ‌వంతుడు ద‌య అనుకున్నాడు. అయితే హోట‌ల్ వారు మాత్రం రూ.23,400 క‌ట్ట‌మ‌న్నారు.  డబ్బు కాదు కింగ్ కోహ్లీని ద‌గ్గ‌రగా చూడటం, వీల‌యితే ఒక మాట‌, మ‌రీ వీల‌యితో ఓ సెల్ఫీ అనుకుని ధైర్యం చేశాడు.  

అక్క‌డ చాలాసార్లు పేరుపెట్టి పిలిచాడు, నాలుగ‌యిదు సార్లు త‌ర్వాత కింగ్ చూశాడు.. వీడెవడ్రా న‌న్ను పిలుస్తున్నాడ‌నుకుని చూశాడు.. ఎవ‌రో అభిమాని అనుకున్నాడే గాని వీడు దారుణ‌మైన వీర వీరాభిమాని అన్న సంగ‌తి తెలియ‌దు. మొత్తానికి కింగ్ ద‌గ్గ‌రికి వెళ్లి రెండు మాట‌లు మాటాడి, ఒక సెల్ఫీ తీసుకున్నా డు. కోహ్లీ ఎంతో అభిమానంగా మాట్లాడాడ‌ట‌. రాహుల్ ఆనందానికి అంతే లేదు.  

భార‌త్ ఆ మ్యాచ్ గెలిచింది.. రాహుల్ ఇంటికెళ్లితే మ‌రి వాళ్ల కుటుంబం ఏమ‌న్న‌దో మాత్రం తెలియ లేదు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu