కడప జిల్లాల్లో రూ. 200 కోట్ల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం

డప జిల్లాలో సుమారు రూ.100 కోట్లు విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూముల ఆక్రమణపై 1995 తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభాసంఘం జిల్లా అంతా పర్యటించి ఏఏ ప్రాంతలో వాక్ఫ్ భూములను ఎవరూ ఎంత ఆక్రమించుకున్నారో పరిశీలించింది. 1997లో ఒక నివేదిక ఇస్తూ ఈ భూములను తిరిగి వాక్ప్ కమిటీలకు అప్పగించాలని సిఫార్సుచేసింది. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఇప్పటికే స్వాహా అయిన భూములతోపాటు మరికొన్ని వాక్ఫ్ భూములు కూడా గత రెండేళ్లుగా అన్యాక్రాంతమయ్యాయి. తాజాగా అన్యాక్రాంతమైన భూముల విలువ మరో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముస్లింల సంక్షేమంకోసం కొంతమంది దాతలు పెద్ద మనసుతో భూములను దానంచేస్తే వాటిని కొంతమంది పెద్ద మనుషులు స్వాహా చేస్తున్నారు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu