దర్జాగ మ్యాచ్ చూస్తున్న మాల్యా..

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామంపెట్టి ఎంచక్కా విదేశాలకు వెళ్లి తలదాచుకున్న కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా దర్జాకు మాత్రం ఎక్కడా లోటు లేదనిపిస్తుంది. లండన్ పారిపోయిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినా.. అతన్ని అరెస్ట్ చేయడానికి పట్టినంత టైం కూడా పట్టలేదు బెయిల్ రావడానికి. అరెస్ట్ అయిన కొద్దిసేపటికే బెయిల్ వచ్చేసింది. ఇక ఆయన్ను ఇండియా రప్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. ఇదిలా ఉండగా నిన్న ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో దర్శేనమిచ్చి అందరికీ షాకిచ్చాడు మాల్యా. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలసిందే. అయితే ఈ మ్యాచ్ ను చూడటానికి మాల్యా వచ్చారు. దాయాదుల సమరాన్ని స్టాండ్స్ లో కూర్చొని వీక్షించారు. దీంతో పరారీలో ఉన్న ఓ వ్యక్తి, ఇంత ధైర్యంగా, దర్జాగా వచ్చి క్రికెట్ చూడటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు... అతని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. మొత్తానికి ఒకపక్క ఆయన్ని ఇండియా రప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయనమాత్రం దర్జాగా  క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చారంటే మాల్యాకు గుండె ధైర్యం ఎక్కువే అని చెప్పొచ్చు..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu