లండన్ ఉగ్రదాడి మాపనే..

 


బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లండన్ బ్రిడ్జిపై ముగ్గురు ఉగ్రవాదులు వ్యాన్‌తో బీభత్సం సృష్టించగా.. బోరోహ్ మార్కెట్‌లో మరికొందరు ఉగ్రవాదులు కత్తులతో ప్రజలపై దాడికి దిగారు. కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ రెండు ఘటనల్లో ఎనిమిది మంది  మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

 

అయితే ఇప్పుడు లండన్ బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది. ‘‘ఇస్లామిక్ స్టేట్ పోరాట యోధులు లండన్‌లో దాడికి పాల్పడ్డారు’’.. అని అమాఖ్ మీడియా పేజీలో ఐసిస్ పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu