మరో చరిత్రకు ఇస్రో శ్రీకారం..

 

ఇస్రో మరో చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. జిఎస్‌ఎల్‌వి మార్క్‌-3 డి1 భారీ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోట షార్‌ అంతరిక్ష కేంద్రం ఈప్రయోగానికి వేదిక కానుంది. నిన్న సాయంత్రం 3.58 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సాయంత్రం 5.28 గంటలకు ముగియనుంది. 25:30 గంటలకు పూర్తయి నేటి సాయంత్రం 5:28 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. భారీ ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి మార్క్‌ 3 నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ ప్రపంచ దేశాల సరసన నిలవనుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతోన్న ప్రయోగంలో దేశం మొత్తం షార్‌ వైపు చూస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu