హ్యాపీ వాలెంటైన్స్ డే..

ప్రేమ..ఈ పదం కంటే తీయనిది మరొకటి లేదేమో.. ప్రేమకు స్పందించని మానవహృదయం ఉండదు. ఆ మాటకొస్తే, జంతువులు, చెట్లు కూడా ప్రేమకు స్పందిస్తాయి. ఇలా ఎన్నో ప్రేమల జీవితాల్లో, మధురమైనది ఇక జంట మధ్యలో ఉండే ప్రేమ. దాన్ని సెలబ్రేట్ చేసుకునేవారికి ప్రత్యేకమైన రోజు వాలంటైన్స్ డే..అసలు వాలంటైన్స్ డే అనేది ఎలా మొదలైందో తెలుసా..?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ వ్యవస్థపై అసలు నమ్మకముందేది కాదు. మన్మథుడులో నాగార్జున పాత్ర లాంటివాడన్నమాట. పెళ్లి చేసుకుంటే మగాళ్ల శక్తి, బుద్ధి నశిస్తాయనే అపోహలో ఉండేవాడు క్లాండియస్. దీంతో తన రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ దెబ్బకు రాజ్యవ్యాప్తంగా ఉన్న పురుషపుంగవులందరూ అల్లాడిపోయారు. వీడు చేస్కోకపోతే పోయాడు. మమ్మల్నందర్నీ పెళ్లి చేసుకోవద్దనడం ఎంత వరకూ న్యాయం అని మూగవేదనతో రోదించారు. అలాంటి టైంలో పుట్టాడు ఆ వ్యక్తి. అతని పేరు వాలంటైన్.

చక్రవర్తి క్లాడియస్ చేసిన ఆజ్ఞను వ్యతిరేకించాడు వాలంటైన్. మగాళ్లు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, బుద్ధికి ఏమీ కాదు. శక్తి అలాగే ఉంటుంది అన్న విషయాల్ని చక్రవర్తికి తెలియపర్చాలనుకున్నాడు. దగ్గరుండి సైనికులు, అధికారులకు వివాహం జరిపిస్తానని పిలుపునిచ్చాడు. అప్పటి వరకూ ప్రేమకు ముఖం వాచిపోయి ఉన్న సైనికలు అధికారులందరూ అతని పిలుపుతో ఒక ఇంటివారై, ప్రేమలోని ఆనందాన్ని అనుభవించారు.

కానీ తన ఆర్డర్ ను వ్యతిరేకించిన వాలంటైన్ కు శిక్ష వేసేవరకూ నిద్రపోకూడదనుకున్నాడు క్లాండియస్. చివరికి క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న సెయింట్ వాలంటైన్ కు ఉరిశిక్షను అమలు చేశాడు. ప్రేమికుల కోసం, ప్రేమ కోసం తన ప్రాణాల్ని అర్పించిన వాలంటైన్ కు గుర్తుగా, అప్పటి నుంచి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు నివాళి అర్పిస్తూ, తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇదండీ వాలంటైన్ కథ. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు. అర్జెంట్ గా మీ లవర్ కు ఫోన్ చేసి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి..!!

హ్యాపీ వాలంటైన్స్ డే...!!!