అమెరికాలో తెలుగు యువకుడి దారుణహత్య..స్నేహితుడే చంపాడా..?

ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌కు చెందిన విజయ్‌కుమార్, రమాదేవి దంపతుల కుమారుడు సంకీర్త్ ఎమ్‌ఎస్ పూర్తి చేసి రెండున్నర సంవత్సరాల క్రితం ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ నగరంలోని అస్టీన్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సంకీర్త్ నిన్న తన రూమ్‌లోనే రక్తపు‌మడుగులో పడి ఉన్నాడు. ఎవరో అతడిని కత్తితో పొడిచి చంపారు. అయితే సంకీర్త్ రూమ్‌లో 15 రోజుల క్రితం సాయిసందీప్‌ గౌడ్ అనే యువకుడు చేరాడు. అతడే సంకీర్త్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిసందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu