తెరాసలో అసంతృప్తి జ్వాలలు!

 

 

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ 69 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితా చూసి ఇతర పార్టీలు ఆనందంతో పండగ చేసుకుంటున్నాయి. ఈ లిస్టులో గెలిచేవారు చాలా తక్కువగా వున్నారని అంటున్నాయి. ఉద్యమంలో పాల్గొన్నారనో, పాటలు పాడారనో, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ తాలూకనో, ఆర్థికంగా బలంగా వున్నారనో కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల అది విజయావకాశాలపై దెబ్బతీసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ స్థానాలలో ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల కంటే బలమైన అభ్యర్థులను ప్రకటించడానికి మిగతా పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.


ఇదిలా వుంటే, తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ సేవలో ఎప్పటి నుంచో తరిస్తున్న వారిని కాదని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, రాజకీయ అనుభవం లేనివారికి టిక్కెట్లు ఇచ్చారన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. పార్టీకి సేవ చేసిన అనేకమంది ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా అసంతృప్తితో వున్న బలమైన అభ్యర్థులకు గాలం వేసే ప్రయత్నాలు మిగతా పార్టీలు ఇప్పటికే ప్రారంభించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu