ఆపన్నహస్తం అందించిన 'తెలుగువన్ ఫౌండేషన్'

 

కుటుంబ బాధ్యత వహించాల్సిన కొడుకు రెండు చేతులు కాలిపోయి ఏం చేయలేని స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే తన రెండు చేతుల్ని ఏమాత్రం కదపలేని స్థితిలో ఉండే వ్యక్తి జీవితం ఎంత దర్భరంగా ఉంటుందో వేరే చెప్పక్కరలేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తెలుగువన్ ఫౌండేషన్.

కన్నా రామంజనేయులు అనే కుర్రాడిది బసవవానిపాలెం.. కోడూరు మండలం. అతనికి 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదంలో అతని రెండు చేతులు పూర్తిగా కాలిపోయి శరీరానికి అంటుకుపోయాయి. కనీసం చేతులు రెండూ ఏమాత్రం కదపలేని పరిస్థితిలో 10 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాడు. అతను తెలుగువన్ ఫౌండేషన్ అధినేత శ్రీ రవిశంకర్ కంఠమనేని ని కలిసి తన పరిస్థితిని వివరించినప్పుడు అతని స్థితికి చలించిపోయిన శ్రీ రవిశంకర్ గారు ముందుకొచ్చి అతని చేతులకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు తను తన ఒక చేతిని కదపగలుగుతున్నాడు.. మరో చేతి ఆపరేషన్ మరో ఆరు నెలల్లో చేయించనున్నారు.