50 ఏళ్లైనా కాంగ్రెస్ కు అధికారం దక్కదు.. అచ్చెన్నాయుడు

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రైతు భరోసా యాత్రపై టీడీపీ నేత ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడదీసి.. తెలుగు ప్రజల మధ్య విబేధాలు ఏర్పడేలా చేసి ఇప్పడు ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల తమ పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఆశించి సోనియాగాంధీ అతి దారుణంగా రాష్ట్రాన్ని విడదీశారని.. కానీ తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారని ఎద్దేవ చేశారు. ఇంకా 50 ఏళ్ల పాటు పోరాడినా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కదని కూడా అచ్చెన్న జోస్యం చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu