కేసీఆర్ అసమర్థుడు.. అందుకే కరెంటు కష్టాలు...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థుడు కావడం, ఆయనకు పరిపాలన అనుభవం లేకపోవడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆయనకు నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల కేసీఆర్ గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన హయాంలో, రాష్ట్రపతి పాలన సమయంలో ఉత్పన్నం కాని కరెంటు కష్టాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొదలయ్యాయని, ఇది కేసీఆర్ చేతగాని తనానికి నిదర్శనమని పొన్నాల విమర్శించారు.