తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది.. కేసీఆర్

 

తెలంగాణ రాష్ట్రం కరెంటు సమస్యతో విలవిలలాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లును సక్రమంగా అమలు చేయడానికి కేంద్రం సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. ఖరీఫ్‌లో రైతులకు విద్యుత్ సరిగా ఇవ్వలేకపోయామన్న కేసీఆర్, రబీలో మాత్రం తెలంగాణ రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వర్షాభావం, విద్యుత్ కొరత ఉన్న కారణంగా రైతులు తమకు సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకటి రెండు సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగవుతుందని ఆయన తెలిపారు.