నా లవర్స్ నన్ను మోసం చేసారు..ఈ ఇద్దరు అగ్ర హీరోయిన్లేగా!
on May 6, 2024
మోసగించబడటానికి ఆడ ఏంటి మగ ఏంటి. కామన్ మాన్ ఏంటి.. సెలబ్రిటీ ఏంటి..అందులోను సినీ సెలబ్రిటీ ఏంటి పైగా స్టార్ హీరో ఏంటి. ఇలా అందరు ఏదో ఒక సందర్భంలో మోసగింపబడిన వాళ్లే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ని మోసం చేసారంట. ఈ విషయం షాహిదే స్వయంగా చెప్పాడు.ఇంతకీ అసలు కథ ఏంటో చూద్దాం
2003 లో వచ్చిన ఇష్క్ ,విష్క్ తో షాహిద్ హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటి వరకు నలభై కి పైగా చిత్రాల్లో నటించాడు.అందులో ఎక్కువ శాతం విజయాన్ని సాధించాయి. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో యాంకర్ షాహిద్ ని ఒక ప్రశ్నఅడిగింది. నువ్వు ప్రేమించి ఎన్నిసార్లు మోసం చేశావు అని. దాంతో వెంటనే నేను ప్రేమించిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు. నేను ఎవర్నీ మోసం చేయలేదు. నాకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ గా నిలిచాయి
ఇక గతంలో షాహిద్ కొంతమంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు.ఇది బహిరంగంగా అందరికి తెలిసిన విషయమే.కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. ఇప్పుడు చేసిన కామెంట్స్ వాళ్ళ గురించే అయ్యుంటుందని అందరు అనుకుంటున్నారు. షాహిద్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భార్య పేరు మీరా రాజ్పుత్. వీరివురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరీనా, ప్రియాంక చోప్రాలు కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.అడపా దడపా సినిమాలు కూడా చేస్తున్నారు. షాహిద్ రీసెంట్ గా తేరి బాటన్ మెయిన్ ఐసా ఉల్జా జియా లో నటించాడు. కృతి సనన్ హీరోయిన్ గా చేసింది