TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతిగా ఆమె బెస్ట్‌...

Published on: Tue Apr 25, 2017 12:47PM

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు బీజేపీ సీనియర్ నేత  రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి. ఇప్పుడు తాజాగా ఆయన రాష్ట్రపతి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురు పేర్లు తెరపైకి వస్తుండగా.. దీనిపై స్వామి ఆసక్తికర ట్వీట్ చేశారు. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారంటూ... ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటని..  తాను మాత్రం గుజరాత్‌ అల్లుడిని కాదా అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.