మా దగ్గర ఉన్న ఆయుధాలు చూసుకోండి...

 

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య వార్నింగ్ ల వార్ నడుస్తుంది. పక్క దేశాల మాట వినకుండా ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తూ వారికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్తరకొరియాపై సీరియస్ అవుతూ వార్నింగ్ లు ఇస్తుంది. అయితే ఇందుకు గాను ఉత్తరకొరియా ఏ మాత్రం తగ్గకుండా అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి తమ వద్ద ఏయే అయుధాలు ఉన్నాయో తెలుపుతూ.. ఓ భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ తెలిపింది. తూర్పు తీరంలోని వోన్‌సాన్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆయుధ ప్రదర్శన నిర్వహించినట్లు యోన్‌హాప్ తెలియజేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu