సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ శ్రీనివాస రాజు

 

ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. టీటీడీ జాయింట్ ఈవోగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఈవోగా పనిచేయాలని భావించినా అవకాశం రాలేదు. 2024 జులై నుంచి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఆయనను తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.

 ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు.