షర్మిలా బస్సు యాత్ర

Publish Date:Aug 29, 2013

Advertisement

 

 

 

 

ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బస్ యాత్ర సెప్టెంబర్ ఒకటిన ఆరంభం కాబోతుండగా, మరోవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన షర్మిల కూడా బస్ యాత్ర సెప్టెంబరు రెండు నుంచి ఆరంభిస్తున్నారు. సెప్టెంబరు 2 వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సుయాత్ర మొదలు పెడతారు.


రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయకూడదని, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ బస్సుయాత్ర చేయనున్నారు. ఇటీవలనే పాదయాత్ర ముగించుకుని షర్మిల తిరిగి బస్సుయాత్ర చేపట్టనుండడం గమనార్హం. సెప్టెంబరు రెండునే హరికృష్ణ కూడా ఆయన తండ్రి స్వస్థలమైన నిమ్మకూరు నుంచి యాత్ర చేయవచ్చని అంటున్నారు. అది కూడా జరిగితే సీమాంద్రలో ముగ్గురు నేతలు యాత్రలు చేస్తున్నట్లవుతుంది.