జగన్ కేసులపై విభజన ప్రభావం

 

 

రాష్ట్ర విభజన ప్రభావం కేవలం ప్రజల మీదనే కాక జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై కూడా పడవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులలో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, కార్యాలయాలు, ఆస్తులు, వ్యవహారాలు ఉన్నందున సీబీఐ పని మరింత కష్టమవుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి విషయ సేకరణ, అనుమతులు, చట్టపరమయిన నిబంధనలు వగైరా అన్నీ సీబీఐకి ప్రతిబంధకంగా మరే అవకాశం ఉంది.

 

అదేవిధంగా రెండు రాష్ట్రాలలో ఏర్పడే ప్రభుత్వాలను బట్టి కూడా కేసు తీరు తెన్నులు మరే అవకాశం ఉంది. ఒకవేళ సీమాంధ్ర, తెలంగాణా రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడినట్లయితే కేసు

 

యధావిధిగా సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస లేదా కాంగ్రెస్-తెరాస సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, సీమంధ్రలో జగన్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే కేసులు నత్తనడకన సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస, సీమంధ్రలో తెదేపా ప్రభుత్వాలు ఏర్పరచగలిగితే కేసులు రేసుగుర్రంలా పరుగులు తీయవచ్చును. ఎందుకంటే సీమాంధ్రకు చెందిన జగన్ మోహన్ రెడ్డి ఆఖరి నిమిషంలో తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డాడడనే అక్కసుతో తెరాస ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహకరిస్తే, వైకాపాను దాని అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రధమ విరోధిగా భావిస్తున్న తెదేపా కూడా సీబీఐకి పూర్తి సహకరించవచ్చును. ఇవిగాక అనేక ఇతర అంశాలు కూడా జగన్ కేసును తీవ్ర ప్రభావితం చేయవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu