ఆగస్టు 10 లోపు రోజా జైలుకెళ్లక తప్పదు..శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

 

ఏపీ శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగస్టు 10 లోపు జైలుకెళ్లక తప్పదని రవినాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల అవినీతికి పాల్పడిన రోజా జైలుకెళ్లడం ఖయామని  శాప్ ఛైర్మన్ తెలిపారు. గతంలో క్రీడా మంత్రిగా పని చేసిన ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. 

రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని ఆయన అన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఒక్క స్టేడియం అయినా రోజా నిర్మించారా..? ఆయన ప్రశ్నించారు. రోజా నగరికి టూరిస్ట్ మాత్రమేన్నారు. నిత్యం ఆమె తమిళనాడులోనే ఉంటున్నారని రవినాయుడు అన్నారు. ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ పై రోజా వ్యాఖ్యలు క్షమించరానిదన్నారు. రోజమ్మా నీకు దమ్ముంటే గాలిభాను సవాల్ ను స్వీకరించాలని సవాల్ విసిరారు. రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయిని తెలిపారు. 

సీఎం చంద్రబాబును ఏకవచనంతో రోజా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు.గత మూడునెలలుగా జగన్ వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని  శాప్ ఛైర్మన్ మండిపడ్డారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu