కమల దళంలో.. కుమ్ములాటలు.. క్యాడర్ బజార్ !!
posted on Jul 21, 2025 8:19PM
.webp)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో ఏమి జరుగుతోంది ? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది,అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహరాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్)కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడిందనేది, ప్రముఖగ్మ వినవస్తోంది.
సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అధినాయకుల మధ్య విభేదాల కారణంగానే, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడి పడడం లేదని ఇటు బీజేపీ ముఖ్యనాయకులు, సంఘ్ పరివార్ సంస్థల కీలక నేతలు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే, మరో వంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పడు బహిరంగంగా బయటకు తన్ను కొచ్చాయి.
పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం,పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో, పార్టీ అధ్యక్షునిగా రామచంద్ర రావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా వంటి సంఘటనలతో, అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిజానికి, రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు కొత్త కాదు. అందుకు బీజేపీ మినహాయింపు కాదు.
కానీ, క్రమశిక్షణకు మారు పేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే, కానీ, బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే, బండి వర్సెస్ ఈటల మాటాల యుద్ధం మేదో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే, ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ్ పరివార్’ సంస్కృతీ నుంచి వచ్చినవారు కాదు. ఈటల విషయాన్నే తీసుకుంటే.
ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకుడు. అంతే కాకుండా, ఆయన బీజేపీలోకి వచ్చే నాటికే, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో.. సహజంగానే’ ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్’తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటల భగ్గుమన్నా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, ఈటల వర్సెస్ బండి వార్’కు పెద్దగా తేడాలేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ,రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై, రాజగోపాల రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ విధాలకు విరుద్దమంటూ తీవ్రంగా తప్పు పట్టారు. నిజానికి, అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్క కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికి పోతున్న నాయకులు ఇంకా ఉంటారు.
ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా, బీజేపీలో అంతర్గత విభేదాలు.. మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే, ఈట ల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ర్ం రాజకీయాల్లో సంచలనంగా మారిందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే. బండి వర్సెస్ ఈటల ‘వార్’ ఎలా ఎండ్’ అవుతుంది? అనేది ఆశక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.