హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ ధరలు పెంపు

 

తెలంగాణలో హరిహర వీరమల్లు మూవీ టికెట్ రెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 23న  ప్రీమియర్ షోకు  టికెట్ ధర రూ.600  గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచుతు జీవో జారీ చేసింది. హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఫిక్షనల్ కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.

 నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.  ఏపీ లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసింది. మూవీ రిలీజైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధరలు పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత గవర్నమెంట్ ని కోరారు. కానీ మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.