వైసీపీకి మరో షాక్.. సీతారాం పార్టీకి గుడ్ బై..

 

ఏపీలో వలసల పర్వం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నేత వైసీపీకి షాక్ ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా మరో సమన్వయకర్తను నియమించడంతో మనస్తాపానికి గురైన సీతారాం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ తనను మోసం చేసిందని.. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పానని తెలిపారు. ఆస్తులు అమ్ముకుని పార్టీకి సేవ చేశానని... కానీ, డబ్బులు పెట్టేవారే పార్టీకి ముఖ్యమని జగన్ అనడం దారుణమని అన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు.