మార్కెట్లోకి శామ్సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

 

యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6 గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోమవారం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ కంపెనీ ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ముందు బార్సినాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి తీసుకొచ్చామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (మొబైల్ అండ్ ఐటీ) అశిమ్ వార్సి చెప్పారు. సోమవారం నుండి బుకింగ్ లు ప్రారంభించామని, వచ్చే నెల 10 నుంచి ఫోన్ విక్రయాలు జరుగతాయని తెలిపారు. ఈ ఫోన్‌ల తయారీలో భారత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ తగిన పాత్ర పోషించిందని ఆశిమ్ వార్సి తెలిపారు.
 
గెలాక్సీ ఎస్6 ప్రత్యేకతలు:
లాలీపాప్ ఓఎస్,
5.1 అంగుళాల డిస్‌ప్లే
16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు.
గెలాక్సీ ఎస్6లో 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ

గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్రత్యేకతలు:
లాలీపాప్ ఓఎస్,
5.1 అంగుళాల డిస్‌ప్లే, ఎస్6 ఎడ్జ్‌లో డ్యూయల్ ఎడ్జ్ స్కీన్ ఉంటుంది
16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
వెర్లైస్ చార్జింగ్, 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు.
గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌లో 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలు..
 మెమరీ        ఎస్6    ఎస్6 ఎడ్జ్
 32 జీబీ        49,000    58,900
 64 జీబీ        55,900    64,900
 128 జీబీ        61,900    70,900