రోజా 'మధుబాల' సెకండ్ ఇన్నింగ్స్

 

 

 'Roja' Madhubala Telugu films, Madhubala Telugu films, actress Madhubala

 

 

మణిరత్నం ‘రోజా’ చిత్రంతో జాతీయ స్థాయిలో తన నటనతో అలరించి మధుబాల గుర్తుంది కదూ. ఆ తరువాత తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అల్లరిప్రియుడు” సినిమాతో అలరించింది. ఆ తరువాత కొన్నాళ్లకు తెరమరుగయిన అమ్మడు తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ మన ముందుకు రానుంది. అదీ ఇప్పుడు తల్లి పాత్రలో మనకు కనపడనుంది.

 

ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న “అంతకుముందు ..ఆ తరువాత” సినిమాలో సుమంత్ కు తల్లిగా మధుబాల మనకు కనిపించనుంది.  ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల 1990లో మళయాళ చిత్రంతో  వెండితెరమీద అరంగేట్రం చేసినా మణిరత్నం రోజా సినిమాతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలు చేసిన ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. రెండేళ్ల నుండి అవకాశాలు లేని ఆమె ఇప్పుడు తల్లి పాత్రలతో అలరించేందుకు సిద్దమవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu