జెన్నీఫర్ చాలా కాస్ట్‌లీ గురూ

 

 

Jennifer Lopez 'too expensive' for IPL 6, Jennifer Lopez IPL 6, Jennifer Lopez hot

 

 

కోల్‌కతాలో వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరో సీజన్‌కు గ్రాండ్‌గా హంగామా చేయాలని నిర్వాహకులు ప్లాన్ వేశారు. ఏకంగా హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌ను రప్పించాలని ఆరాటపడ్డారు. ఖర్చు కాస్త ఎక్కువయినా ఫర్వాలేదని సిద్ధపడ్డారు. ఐపీఎల్ బాస్‌లు జెన్నిఫర్‌ను సంప్రదించడం.. భారత్ రావడానికి ఈ అందాల భామ ఓకే చె ప్పడం చకచకా జరిగిపోయాయి. ఇంకేం ఈ అమ్మడు వచ్చేసినట్టేనని మనోళ్లు సంబరపడిపోయారు. అయితే, 43 ఏళ్ల సుందరి చెప్పిన కోర్కెల చిట్టా వినగానే తలతిరిగినంత పనైపోయిందట! జెన్నీ కంటే స్వదేశీ టాలెంటే బెటరనుకుని ఫిక్సయిపోయారు.ఇంతకీ హాలీవుడ్ భామ ఏం డిమాండ్ చేసిందంటే రానూ.. పోనూ ఓ ప్రత్యేక విమానం చాలందట. ఇక వ్యక్తిగత అలంకార సిబ్బంది, సహాయకులు, ఆఖరికి వంట మనిషిని కూడా వెంటతెచ్చుకుంటానని సెలవిచ్చింది. గ్రూప్ అందరికీ కలిపి స్టార్ హోటల్లో డజన్ల కొద్దీ గదులు బుక్ చేయమం ది. ఇందుకో సం అయ్యే ఖర్చునంతా గిఫ్ట్‌గా ఆఫ ర్ ఇచ్చింది. ఆడిపాడినందుకు ఎలాగూ భారీ మొత్తం సమర్పించుకోకతప్పదు. అమ్మడు డిమాండ్లు వినగానే ఐపీఎల్ బాస్‌లు సైలెంట్‌గా సైడయిపోయారట. ఇంత మొత్తం తమ వల్ల కాదంటూ.. ఈసారికి షారుక్, కత్రినా, దీపికతో సరిపెట్టుకున్నారు.