చాలా మర్యాదగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన రోజా
posted on Oct 12, 2015 11:34AM

వైకాపా పార్టీ ఎమ్మెల్యే రోజా తమ అధినేత జగన్ చేస్తున్న దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాలని.. ప్రశ్నించడానికి వచ్చిన పపన్ కళ్యాణ్ ఎందుకు మోడీని.. చంద్రబాబును ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలకు.. రోజా చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఈ సీన్లోకి లాగిందని అనుకుంటున్నారు. చాలా వరకూ రోజా మాట్లాడే సందర్భల్లో మర్యాద పూర్వకంగా మాట్లాడటం చాలా తక్కువ. సూటిగా మాట్లాడటం.. మాటలతోనే ప్రత్యర్ధులకు మంటలు పుట్టించడం రోజాకు చాలా తేలికైన పని. అలాంటిది పపన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా గౌరవంగా.. మర్యాదపూర్వకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ.. చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చూస్తూ.. ‘‘పవన్ కల్యాణ్ గారు ఆ మాటలకు మీరే సాక్షి’’ అని వ్యాఖ్యానించారు. మరి పవన్ కళ్యాణ్ రోజా ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నిస్తారో లేదో చూడాలి.