కొడంగల్ పై అప్పుడే అంత అవసరమా...
posted on Nov 4, 2017 12:21PM
.jpg)
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది. కొండగల్ సీటుపై అప్పుడు ఎవరు గెలుస్తారబ్బా అని ఇప్పటినుండే తెగ చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్టీ టీడీపీ తరపున కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ వస్తుంది. దీంతో అప్పుడే బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారా..? అని ఆల్రెడీ బెట్టింగులు కూడా మొదలయ్యాయట. కాంగ్రెస్ ,టీఆర్ఎస్ నేతలు గెలుపు మాదంటే మాదని ప్రకటనలు చేస్తున్నారు. బలాబలాలు లెక్కేసుకుంటున్నారు. ఏ అభ్యర్థి అయితే గెలుస్తారనే దానిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. అసలు కొడంగల్ ఉపఎన్నిక జరిగే ఛాన్స్ ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. దీనికి కారణం రేవంత్ రెడ్డి రాజీనామా చంద్రబాబుకు ఇవ్వడమే. అసలు రేవంత్ రాజీనామా స్పీకర్ కు ఇవ్వాలి. చంద్రబాబు కనుక రేవంత్ రెడ్డి రాజీనామా లెటర్ స్పీకర్ కు పంపితే.. మిగతా వాళ్ల సంగతి ఏంటని అంతా ప్రశ్నిస్తారు. దీంతో చంద్రబాబు స్పీకర్ కు పంపించడం మాత్రం అనుమానమే. ఒకవేళ పంపకపోతే కొడంగల్ స్థానం అవ్వనట్టే. అదే కనుక జరిగితే కొడంగల్ స్థానానికి ఉపఎన్నిక జరగడం కష్టం. అంత దానికి కొడంగల్ స్థానం నుండి ఎవరిని బరిలోకి దించాలని పార్టీలు తెగ ఆలోచించడం.. అది ఒక్కటే కాదు అప్పుడే బెట్టింగులు కూడా జరగడం హాస్యాస్పదం. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.