పాదయాత్ర రోజే జగన్ కు భారీ షాక్....

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకులు తగలడం కామనైపోయింది. ఇప్పటికే షాకుల మీద షాకులు తగులుతుండగా.. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీని వీడి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు.. తూర్పుగోదావ‌రి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఇటీవలే ఆమె జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీ మారే యోచనలు చేస్తున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆవార్తలను నిజం చేస్తూ ఆమె టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. మరికొద్దిసేపట్లో ఆమె అమరావతికి చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరడంతో మొత్తం 22 మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినట్టు. ఇదిలా ఉండగా మరో ఐదారుగురు కూడా టీడీపీలోకి రానున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.  వీరంతా 6వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించిన క్షణాన తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలుస్తోంది. మొత్తానికి పాదయాత్రకు ముందే జగన్ కు భారీ షాక్ తగలనుందన్నమాట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu