కాలేజీ విద్యార్థులకు జియో బంపరాఫర్.
posted on Jul 24, 2017 11:34AM

ఇప్పటికే రిలయన్స్ జియో పలు సంచలనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. ఉచిత డేటా సర్వీసులు, ఇప్పుడు అతి తక్కువ ధరకు జియో ఫోన్ అందిస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అదేంటంటే.. దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు జియో సిద్ధపడుతున్నట్లు తెలిసింది. దీనికోసం గత నెలలోనే జియో హెచ్‌ఆర్డీకు ప్రెజెంటేషన్ ఇచ్చిందని.. ఇందులో జియో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని...భవిష్యత్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పిందని.. దీంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్‌ఆర్డీ అధికారి తెలిపారు.