సెహ్వాగ్, మోర్గాన్.. మళ్లీ ట్విట్టర్ వార్..
posted on Jul 24, 2017 12:23PM

డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ కు బ్రిటీష్ జర్నలిస్ట్ మోర్గాన్ మధ్య మళ్లీ ట్వీట్టర్ వార్ మొదలైంది. మహిళ ప్రంపంచకప్ లో ఇంగ్లండ్ పై టీమిండియా జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మోర్గాన్ సెహ్వాగ్‌ను ఈ విజయం సరిపోతుందా మిత్రమా.. అని సెహ్వాగ్ కు ట్వీట్ చేశాడు. దీనికి గాను సెహ్వాగ్... ఈ ఓటమిని కూడ మేం గర్విస్తున్నాము.. దీంతో మా జట్టు మరింత ధృడంగా తయారైందని స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు.
కాగా గతంలో రియో ఒలంపిక్స్ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ట్వీట్టర్ వేదికగా మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. రియో ఒలంపిక్స్ లో పీవీ సింధూ స్వర్ణ పతకం గెలవగా..పీవీ సింధూపై అందరూ ప్రశంసలు కురిపించారు. దీంతో భారత అభిమానులను తప్పు బడుతూ మోర్గాన్ ట్వీట్ చేశాడు. దానికి క్రికెట్ కనిపెట్టిన మీరు( ఇంగ్లండ్ మెన్స్ జట్టు) ఇంత వరకు ఒక వరల్డ్‌కప్ సాధించకపోవడం సిగ్గు చేటు అని సెహ్వాగ్ స్ట్రాంగ్ సమాధానమిచ్చారు. ఇప్పుడు దానికి గాను .. ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో మోర్గాన్ పాత విషయాలు గర్తుచేస్తూ మళ్లీ ట్వీట్టర్ వార్ కు దిగాడు.
