జియో కొత్త ఆఫర్..100% క్యాష్ బ్యాక్

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ డాంగిల్, డేటా కార్డ్, వైఫె రూటర్స్ వినియోగదారులను తన వైపుకు లాక్కొనే స్కెచ్ వేసింది. తాజా ఆఫర్ ప్రకారం కొత్త వినియోగదారులు డాంగిల్‌కు చెల్లించిన ధరను డేటా బెనిఫిట్స్ రూపంలో 100 శాతం తిరిగి పొందే అవకాశం ఉంది. జియో కొత్త డాంగిల్ ధర రూ.1,999 కాగా, ఇప్పటికే ఇంర్నెట్ డాంగిల్ వాడుతున్న వారు కొత్త దానికోసం రూ.999 చెల్లించి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వినియోగదారుడు రూ.1000 డిస్కౌంట్‌ పొందినట్లవుతుంది. కొత్త జియోఫై తీసుకున్న తర్వాత రూ.408(రూ.99ప్రైమ్‌ మెంబర్‌షిప్‌+ రూ.309 ధన్‌ ధనా ధన్‌ప్లాన్‌)తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత రూ.149 ప్యాక్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే రూ.201 విలువ కలిగిన 5 బూస్టర్‌ ప్యాక్‌లు వినియోగదారుడు పొందుతాడు. ‘201 బూస్టర్‌ ప్యాక్‌’తో 5జీ, 4జీ డేటాను 28రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటి మొత్తం విలువ రూ.1,005 అవుతుంది. అంటే జియోఫై డివైజ్‌పై రూ.1000 డిస్కౌంట్‌ అందినట్లే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu