ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరి అరెస్టు

తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్నకారు నుసీజ్ చేసి   ఒకరిని అరెస్ట్ చేశారు.  టాస్క్ ఫోర్స్ బృందం  భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్  నిర్వహిస్తుండగా శనివారం (జూన్ 28)  రంగంపేట - శ్రీనివాస మంగాపురం రోడ్డులో  వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. అందులోనుంచి  ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా  పొలీసులు వెంటాడి  అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu