కూతురి ఫొటో పెట్టిన వర్మ...రాక్షసుడిగా మారకముందు...

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై.. ఎవరో ఒకరిపై విమర్శలు గుప్పించే రాంగోపాల్ వర్మకు ఇన్ని రోజులకు తన పర్సనల్ లైఫ్ గుర్తొచ్చినట్టు ఉంది. ఇప్పటివరకూ అభిమానులతో తన కుటుంబం గురించి ఏ విషయాలు పట్టించుకోని వర్మ.. తాజాగా చిన్నప్పుడు తన కుమార్తె రేవతి వర్మతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  అంతేకాదు ‘నా పూర్వ జన్మకు సంబంధించిన ఒక చిత్రం. రాక్షసుడిగా మారకముందు, నా మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫొటో ఇది’ అని కూడా ఓ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఫొటో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఎన్నో రీట్వీట్లు, లైకులు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులకు వర్మకు తన ఫ్యామిలీ ఎందుకు గుర్తొచ్చిందో..!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu