హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభ సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఏడాదిపాటు నిర్వహించే ఉస్మానియా శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu