కుటుంబసభ్యులే రజనీని అడ్డుకుంటున్నారా..?

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చేది ఫిక్స్ ఆ లేదా.. వస్తే కొత్త పార్టీ పెడతారా..? లేక వేరే ఏదైన పార్టీలోకి చేరుతారా..? అసలు దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు..? ఇలా ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్ది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వాటికి సమాధానం ఇప్పుడప్పుడే దొరికే పరిస్థితి లేదు. ఇక రజనీ రాజకీయాల్లోకి రావడంపై ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్లూ ఉన్నారు.. అలాగే ఆయనను వ్యతిరేకించేవారూ ఉన్నారు. రజనీకాంత్‌ తమిళేతరుడని, రాజకీయ పార్టీ పెట్టడమో, సీఎం కావడమో సహించేది లేదని కొన్నిపార్టీలు దుయ్యబట్టాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులే ఆయనను రాజకీయాల్లోకి రాకుండా బ్రేక్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అసలు మనకు రాజకీయాలే వద్దు అని కుటుంబసభ్యులు రజనీకాంత్‌ను వారిస్తున్నారట. ఒకవేళ రాజకీయాల్లోకి కనుక వస్తే  అలుపెరగకుండా తిరగాలి, పూర్తిగా విశ్రాంతి ఉండదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారట. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల్లో రాజకీయాలు సమంజసం కాదని వారు రజనీకి నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది. కాగా రజనీ ప్రస్తుతం కాలా షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్‌ ముగిసిన తరువాత అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంటారని సమాచారం. మరి కుటుంబసభ్యుల మాట రజనీ వింటారో..? లేదో..?ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu