దాక్కున్న ఉగ్రవాదులు...మహిళ మృతి..


భారత-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి చొరబడ్డారు ఉగ్రవాదులు. వివరాల ప్రకారం...జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నట్టు సమాచారం అందినవెంటనే.. ఆ ఇంటిని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ తీవ్రంగా గాయపడి కన్నుమూసింది. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu