కర్మ యోగి దార్శనికుడు పీవీ నరసింహ రావు జయంతి !

గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్

 

PV Narasimha Rao Jayanthi, Special Story  PV Narasimha Rao,   PV Narasimha Rao news

 

 

భారత దేశం ఆర్దిక పునర్నిర్మాణంలో బాగంగా దేశానికీ తనదైన శైలిలో సేవచేసిన అపర చాణక్యుడు, లోపలి మనిషి, కర్మ యోగి పీవీ నరసింహరావు ను అయన జయంతి సందర్బముగా అందరు తలచుకోవలసిందే !.

 

1991 లో రాజీవ్ గాంధీ శ్రీ పెరంబుదూర్ లో దుర్మరణం అయిన కూడా ,ఆ సానుభూతి పవనాల్లో కూడా కాంగ్రెస్ కి తగిన సీట్లు రాలేని పరిస్తితుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వంత పార్టీ లోని ప్రముఖులు అయన పై అసమ్మతి లేపి ప్రతి దినము ఆయనను ఇరుకున పెడుతున్నా కాని ,ఇండియా ఆర్దిక పరిస్థితి ఘోరంగా ఉండి చివరకు భారత దేశం బంగారు ను ప్రపంచ విపణి లో కుదువ బెట్టాల్సి వచ్చిన కష్ట సమయములో తన చాణక్య నీతిని ప్రదర్శించి మెజారిటీ లేని ప్రభుత్వానికి ప్రధాన మంత్రిగా ఉంటూ ,ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కొన్ని తప్పులు విధి లేక చేయాల్సి వచ్చిన కూడా దేశంను సరళీకృత ఆర్దిక సంస్కరణల ద్వార అప్పుల వూబి నుంచి బయట పడవేయడం లో అయన సామర్ద్యం అమోఘ మయినది !.

 

1) పంజాబ్ లోని తీవ్ర వాదాన్ని ఉక్కు పాదముతో అణచివేశారు,ఖలిస్తానుఉద్యమాన్ని తోక్కేసారు.terrorism దాడిలో ఒక కాలు పోగొట్టు కున్న జాతీయ వాది బిట్టా (Maninderjeet Singh Bitta )ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నిలబెట్టి పంజాబ్ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు ! .ఇప్పుడు ఆ బిట్టా ను సోనియా కాంగ్రెస్ తొక్కేసింది .http://en.wikipedia.org/wiki/Maninderjeet_Singh_Bitta)

 

2)   మన్మోహన్ సింగ్ ను ఆర్దిక మంత్రిగా అవకాశం ఇచ్చి,తను వెనుక నుండి నడిపిన  సరళీకృత ఆర్దిక సంస్కరణ లు   దేశాన్ని గాడి లో పెట్టగలిగారు ! . ఇప్పుడు ఇదే మన్మోహనుడు అత్యంత విపలమయిన ప్రధానిగా పేరు తెచ్చుకొన్నారు .

 

3) ప్రతి పక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయీ గారిని తన గురువు గా ప్రకటించి అయన ద్వార తానూ ఎంతో ఉత్తేజం పొందానని పార్ల మెంటు సమక్షములో ఒప్పుకొని వాజ్ పాయి గారికి బెస్ట్ పార్ల మెంటు అవార్డు ఇచ్చినది మనకందరికీ తెలిసిందే !
  
    
4) కాంగ్రెస్ లోని అర్జున్ సింగ్ ,ఎన్ డీ తివారి,ముపనార్  లాంటి నాయకులను తట్టుకొని వాళ్ళను దమ్మిలు చేయగలిగారు !
    

5) ఆయన విపరీతమైన ఆందోళనకు గురి అయినప్పుడు పాత తెలుగు సినిమాలు చూస్తూ ,ముక్యముగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్యపు మూవీ లు చూసి రిలాక్స్ అయ్యే వారని ఆయనే స్వయముగా ప్రకటించారు.
    
 

6) గోవధ పై నిషేధం ఇవ్వాలని BJP  పోరాడుతున్నప్పుడు  కాంగ్రెస్ ప్రముఖులు ఒట్టిపోయిన  ,వయసు అయిపోయిన పశువులను పశువుల వధ శాలకు పంపాల్సిందే అని అంటే అప్పుడు  ఆ ఉద్యమం లో పోరాడుతున్న BJP సన్యాసిని సాద్విరితంబర గారు పీవీ నరసింహరావు గారు కూడా ముసలి వారు అయ్యారు కాబట్టి ఆయనను కూడా వధశాలకు పంపాల్సిందే అని అంటే అ కర్మ యోగి నిజమే కదా అని ఎంతో నవ్వుకొన్నారట .
    
 

7)  ఎన్ టీ రామరావుగారు తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని పోటి పెట్టకుండా పీవీ నరసింహ రావును పార్లమెంట్లో అత్యదిక మెజారిటీ తో గెలిపించి పంపితే, మళ్ళీఅదే పీవీ గారు తన ప్రభుత్వం పడి పోయే సమయం లో తెలుగు దేశం ఎంపీ లను చీల్చి ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారు .
    
   

8) హర్షద్ మొహతా కోటి రూపాయలు సూట్ కేసు విషయంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొనడంలో ఎన్నో విమర్శలకు గురి అయినప్పటికీ అన్ని కూడా రాజ్యాన్ని కాపాడుకోడానికే చేసాడు కాని అయన స్వంతానికి ఏమి వాడు కోలేదు .
    
   

9) పీవీ  స్వయానా AICC ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన సీతారం కేసరి సోనియా గాంధి కోటరితో పీవీ నరసింహ రావు గారికి ఎంతో వ్యతిరేకముగా పని చేసి చివరికి పీవీకి ఎన్నికలలో టికెట్ కూడా రాకుండా చేసారు. ఆ తరువాత అవమాన పరిస్థితుల్లో కేసరి అదే సోనియా గాంధి కోటరి దెబ్బకు హీనంగా AICC నుంచి గెంటి వేయబడ్డాడు !
    
   

10) శ్రీ రామ తీర్తుల వారి రచనలు ద్వార ఉత్తేజం పొందిన పీవీ ,స్వతంత్ర సమరయోదుడుగా ఉస్మానియా యూనివేర్సిటి లో అప్పట్లో నిచేదించిన వందేమాతరం  ఆలకించి యూనివెర్సిటీ నుంచి సస్పెండ్ అయినారు . ఎన్నో భాషలతో మమేకం అయ్యారు . పీవీ అయన చరిత్రను "లోపలి మనిషి " (the Insider )అని పుస్తకము వ్రాసారు.విశ్వనాధ సత్యనారాయణ గారి  వేయి పడగలు అనే పుస్తకాన్ని sahasraphan అని హిందీ లోకి అనువదించారు .
   
    
   

11)అబ్దుల్ కలాం గారు పీవీ గురించి మాట్లాడుతూ "గొప్ప రాజనీతిజ్ఞుడు అయన రాజకీయ వ్యవస్థ కంటే   కూడా దేశం అన్నిటికన్నా గొప్పది అని నమ్మి ఆచరించిన వారు అంటారు.

   

12) పీ వీ ఆర్దిక సంస్కరణలను ప్రతి పక్షములో వున్న BJP వ్యతిరేకించినా కాని ఆ తరువాత వాజ్ పేయీ గారి ప్రభుత్వం వాటిని అలాగే కొనసాగించడం విశేషం !

   

13) ఎన్నోసార్లు లోక్ సభలో మెజారిటీ నిరూపించు కోవాల్చి వచ్చినపుడు ఒక్కొక్క సారి ఒక్కొక్క పార్టీ ని చీల్చడం ద్వార కాపాడుకొన్నారు . చాలా సందర్భాల్లో BJP కూడా ఎన్నో సార్లు పార్లమెంట్లో వోటు ను బహిష్కరించి పీవీ ప్రభుత్వాన్ని indirect గా  కాపాడిందని అంటారు. 
   
   

14) కాంగ్రెస్ ప్రభుత్వాలలో దేశాన్ని పాలించిన  లాల్ బహదూర్ శాస్రి గారి తరువాత గొప్ప ప్రధానిగా ,Father of Indian Economic Reforms గా పేరు తెచ్చుకొన్నారు .
    
   

15) ఎన్నో ప్రభుత్వాలలో ముఖ్య పదవుల్లో పనిచేసినా గాని అయన చివరి రోజుల్లో కోర్టు కేసులలో విముక్తి పొందినా గాని వాదించిన లాయర్లకు డబ్బులు ఇవ్వలేక అయన స్వంత ఇంటిని అమ్మి వారి బకాయిలు తీర్చారని ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన IAS PVRK ప్రసాద్ గారు ప్రకటించారు .
    
   

16) అయన ఢిల్లీ లో మరణించినపుడు కాంగ్రెస్ పార్టీ కి ,AICC లో ఎన్నో సేవలు చేసినప్పటికి, సోనియా గాంధీ కోటరి ఆయన పార్ధీవ దేహాన్ని ఢిల్లీ AICC ఆఫీసులోకి  అనుమతించకుండా అవమానించింది. హైదరబాద్ పంపేసింది .  
      
   

తెలుగు తేజం  స్వర్గీయ ఎన్ టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ హయాం లో ఏర్పాటు అయినట్లు  మరొక తెలుగు దార్శనికుడు ,కర్మయోగి పీ వీ నరసింహ రావు గారి విగ్రహం బీ జే పీ హయం లో ఏర్పాటు అవుతుందేమో అని ఆశిస్తున్నా !   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu