ఒకేసారి ఆరు ఉపగ్రహాలు...

 

నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆరు ఉపగ్రహాలను విశ్వలోకి పంపనున్నారు. ఆరు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-29ని శాస్త్రవేత్తలు లాంచ్ చేయనున్నారు. ఇది షార్ సెంటర్ నుంచి జరగబోతున్న 50వ ప్రయోగం. ఆరు ఉపగ్రహాలను నింగిలోకి ఒకేసారి పంపించడం ఈ ప్రయోగంలో వున్న ప్రత్యేకత. ఈ వాహక నౌక సింగపూర్‌కి చెందిన 625 కిలోల బరువున్న ఆరు ఉప గ్రహాలను మోసుకుని వెళ్ళనుంది. వీటిలో 400 కిలోల బరువున్న టిలియోన్ ఉపగ్రహం చాలా ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ పరిశీలన కోసం సింగపూర్ అంతరిక్ష పరిశోధన సంస్థ మొట్టమొదటిసారిగా టిలియోన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది.