కేజ్రీవాల్ పై బీజేపీ ఫైర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యలయంలో నిన్న సీబీఐ దాడులు నిర్విహంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేజ్రీవాల్ కు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతుంది. మోడీ కావాలనే తన కార్యలయంపై దాడులు చేయించారు.. మోడీ పిరికివాడు.. సైకోపాత్ అంటూ క్రేజీవాల్ మండిపడుతుంటే.. మరోవైపు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతి దానికి మోడీ అనడం కేజ్రీవాల్ కు సరదా అయిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ కు తృణమూల్, కాంగ్రెస్, జేడీయూ నేతలు మద్దతు పలుకుతున్నారు. దీంతో ఈ వ్యవహారం.. చిన్నగా రాజకీయ రంగు పులుముకుంటున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu