మోడీ కేబినెట్ నుండి ఇద్దరు ఔట్...
posted on Jul 13, 2016 11:54AM

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే కేబినెట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ విస్తరణలో పలువరికి కొత్త పదవులు దక్కగా.. మరికొంత మందికి శాఖల మార్పులు జరిగాయి.. ఇంకొంత మంది పదవులు కోల్పోయారు. కొత్తగా వచ్చిన 19 మంది మంత్రులతో కేంద్ర మంత్రివర్గం సంఖ్య 78 కి చేరింది. అయితే ఇప్పుడు ఇందులో ఇద్దురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తులా, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జీఎం సిద్దేశ్వర తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. దీంతో మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పూర్తి బాధ్యతలు అప్పగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియాకు భారీ పరిశ్రమల శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు.